ఇది…కష్టాలు, ఆశలు అరణ్యరోదనగా మారినపుడు, తమ మనోభావాలకు వేదికగా వుండవలసిన ప్రజా ప్రతినిధులు దగా పూరితంగా వ్యవహరిస్తున్నపుడు, రైతులు తమ గుండెకోతను వ్యక్తం చేయడానికి మిగిలిన మార్గం…ఆత్మహత్య…
జీవన వ్యాపకాల్లో మౌలికమైన మార్పులు వచ్చినపుడు తలఎత్తే సంక్షోభాలు వ్యవస్ధాగతమైన ఆత్మహత్యలుగా మారిపోతున్నాయని ప్రపంచఅనుభవాలు రుజువు చేస్తూనే వున్నాయి. నివారణలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే వున్నాయి.…
ఒక బాకీ వున్న వ్యక్తికి అదితీరకుండా, లేదా రీషెడ్యూలు కాకుండా, ఏ బ్యాంకూ కొత్త రుణం ఇవ్వదు. ఈ షరతులకు లోబడే రైతులు అప్పులతో వ్యవసాయం చేస్తున్నారు. …