బొట్టుబొట్టుగా పోగుపడే విజ్ఞానం – జ్ఞానధారగా మారే వైనం

(రాజమండ్రి మెడికల్ కాలేజిలో “సెక్సువల్ మెడిసిన్” కోర్సు!)

రాజమండ్రిలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో

“సెక్సువల్ మెడిసిన్” కోర్సు ప్రారంభించగలమని ఆ సంస్ధ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు వెల్లడించారు.

విశాఖపట్టణంలో మూడురోజుల జాతీయ 35 వ సెక్సాలజి కాన్ఫరెన్సుని ఆగస్టు 16 సాయంత్రం ఆయన ప్రారంభించారు.

సామాన్యులకు అర్ధమయ్యేలా లైంగిక విజ్ఞానాన్ని వ్యాసాలు, పుస్తకాలు రాయడం ద్వారా అందిస్తున్న డాక్టర్ ప్రకాష్ కొఠారి, డాక్టర్ సమరం, డాక్టర్ పూషా(అభిసారిక), సెక్స్ అనే మాట పలకడానికే ఇబ్బంది పడే కాలం నుంచీ లైంగిక వ్యాధులను నయం చేస్తున్న డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ నరశింహారెడ్డి డాక్టర్ రఘురామారావు తదితరులతో పాట పలు రాష్ట్రాల నుంచి వందమందికి పైగా డాక్టర్లు కాన్ఫరెన్సు సైంటిఫిక్ గోష్టులలో తమ అధ్యయనాల డాక్యుమెంట్లను ప్రెజెంట్ చేస్తారు.

చర్మవ్యాధుల (డెర్మటాలజి) విభాగంలో ని లైంగికవ్యాధులకు చికిత్సలు చేసే వైద్యుల అనుభవాలు పోగుపడి పోగుపడి వారి వృత్తి సంఘాలలో చర్చలై, చర్చల సారాంశాంలై, అ సారాంశాలే ఎగువ స్ధాయిలో మళ్ళీ చర్చలై…చర్చలు మళ్ళీ సారాంశాలై…ఈ క్రమంలో లో వైద్య విజ్ఞానం ప్రమాణికమౌతుంది.

లైంగిక విజ్ఞాన విభాగంలో దేశానికే అత్యున్నత స్ధాయి ప్రామాణిక వ్యవస్ధ అయిన “కౌన్సిల్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్ హుడ్ – ఇంటర్నేషనల్ ( సి ఎస్ ఇ పి ఐ) అధ్వర్యంలో 35 వ జాతీయ సెక్సాలజీ సమ్మేళనం జరుగుతోంది.

దేశవ్యాప్తంగా డాక్టర్ల ప్రాక్టీసు ద్వారా ఏర్పడిన ప్రామాణికతకు తొలిగుర్తింపు వృత్తినిపుణుల సంఘాలు ఇచ్చే “ఫెలోషిప్” అవుతుంది. రెండో దశగుర్తింపు యూనివర్సిటీ ఆమోదం వున్న “డిప్లమో” అవుతుంది. తరువాత గుర్తింపు నేషనల్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజేషన్ వున్న గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అవుతాయి.

ఈ క్రమంలో సెక్యువల్ మెడిసిన్ పై జిఎస్ఎల్ మెడికల్ కాలేజి ఫెలోషిఫ్, డిప్లమో కోర్సులు త్వరలో ప్రారంభించబోతోంది. ప్రామాణికమైన వైద్యుల అనుభవాల సారాంశాన్ని కోర్సుగా రూపాంతరం చెందించడానికి సిద్ధమైన డాక్టర్ గన్ని భాస్కరరావుని సమ్మేళనానికి ప్రతినిధులుగా వచ్చిన పలువురు డాక్టర్లు వ్యక్తిగతంగా కలిసి అభినందించారు. – పెద్దాడ నవీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *