పొంచివున్న గుండెపోటు ను నిర్వీర్యం చేయవచ్చు

హార్ట్ ఎటాక్ లక్షణాలను ఎవరికివారే గుర్తించవచ్చు
*నొప్పి (ఒక లాంటి బాధ)
*డిస్కంఫర్ట్ (గాభరాగా వుండటం)
*అనీజీనెస్ (స్ధిమితంగా లేకపోవడం)
*హెవీనెస్ (భారంగా వుండటం)

ఈ లక్షణాల్లో ఒకటి /కొన్ని/అన్నీ
*ఛాతి
*మెడ
*దవడలు
*వెన్ను/వీపు
*పొత్తికడుపు
*చేతులు
*భుజాలు
మొదలైన శరీరభాగాల్లో ఎక్కడైనా పై లక్షణాలు వుండటం …
ఈ సూచనలతోపాటు 
*ఊపిరి అందకపోవడం
*వికారం/వాంతి వచ్చేలావుండటం 
*మొద్దుబారినట్టు/తిమ్మిరిగా వుండటం
*చెమటలు పట్టడం
*గుండెకొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు 
….వుండటం -ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతూ 20 నిమిషాలు కొనసాగడం

హార్ట్ ఎటాక్ కావచ్చు!

వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేయాలి
వైద్యసహాయం అందేలోగా చప్పరించే ఆసి్ప్రన్ (350 మిల్లీగ్రాములు) తీసుకోవచ్చు

ఎప్పుడూ సిద్ధంగా వుంచుకోవలసినవి
*24 గంటలూ పనిచేసే ఎమర్జన్సీ హాస్పిటల్ ఫోన్ నంబర్
*అంబులెన్స్ ఫోన్ నంబర్

హాస్పిటల్ ఎలాంటిదై వుండాలి
*ECG వుండాలి
*హార్ట్ ఎటాక్ ను టీ్రట్ చేసే ICU వుండాలి
*సమయం వృధాకాని అందుబాటుతనం హాస్పిటల్ లోవుండాలి 
వెంటనే అంబులెన్స్ రాకపోతే సురక్షితంగా ఎవరైనా హస్పిటల్ కి రోగిని తీసుకువెళ్ళాలి
*రోగి స్వయంగా డ్రైవ్ చేయకూడదు

షాక్ అనిపించే నిజాలు…
*ప్రపంచవ్యాప్తంగా 2008 సంవత్సరం మరణాల్లో 30% గుండె (కార్డియోవాస్కులర్) జబ్బుల వల్ల సంభవించినవే!
*ఇండియాలో ఏటా 26.6 లక్షల హార్ట్ ఎటాక్ కేసులు నమోదౌతున్నాయి
*అంటువ్యాధుల వల్ల మరణాలకంటే గుండె జబ్బుల వల్ల మరణాలు పెరిగిపోయాయి
*25 నుంచి 69 ఏళ్ళ వయసువారి మరణాల్లో 25% మరణాలకు గుండెజబ్బులే కారణమౌతున్నాయి
*ఏవయసువారి మరణాలలోనైనా కారణాలు 19% గుండెజబ్బులే అవుతున్నాయి
*సిపిఆర్ శిక్షణ వల్ల 6-7% కార్డియోవాస్కులర్ మరణాలను నివారించవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *