89% సక్సెస్

జిఎస్ఎల్ మెడికల్ కాలేజి

ఆరోగ్య సంరక్షణ దృఢమైన ముక్కాలి పీట లా వుండాలి పేషెంట్ కి చికిత్స, సమాజానికి ఆరోగ్య సంరక్షణ, భరించగలిగిన స్థాయిలో వైద్య ఖర్చులు వీటిని బెసగకుండా వుంచే ట్రీట్ మెంట్ నాణ్యత లమధ్య సమతూకం వుండేలా ప్రాక్టీసును తీర్చిదిద్దుకోవాలని డాక్టర్ టిఎస్ రవికుమార్ ఎంబిబిఎస్ పూర్తిచేసి వెళుతున్న యువ డాక్టర్లకు పిలుపు ఇచ్చారు.

మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎఐఐఎంఎస్) ప్రసిడెంట్, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ చాన్సలర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ రవికుమార్ గురువారం సాయంత్రం జిఎస్ఎల్ మెడికల్ కాలేజి 11 వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిధిగా డిగ్రీలు ప్రదానం చేశారు.

రోగులకు నేరుగా చికిత్స చేయడానికి ముందుగానే సిములేటర్ల ద్వారా మెడికోలతో ట్రీట్మెంటు ఇప్పించడంలో జిఎస్ఎల్ సంస్ధల వ్యవస్థాపకుడైన డాక్టర్ గన్ని భాస్కరరావు విజన్ ను డాక్టర్ రవికుమార్ ప్రస్తుతించారు. రోగుల వ్యాధులను ఆస్పత్రులలో తీసుకునే జాగ్రత్తలు 50 శాతం వరకూ తగ్గించగలవని ప్రాక్టీసులోకి వెళుతున్న డాక్టర్లు మరచిపోరాదని ఆయన సూచించారు.

జిఎస్ఎల్ మెడికల్ కాలేజి 11 వ బ్యాచ్ లో 138 కి 123 మంది (89.13%) పాసయ్యారు. 29 మంది ఫస్ట్ క్లాస్ లో పాలయ్యారు. ఆర్ శ్రీలక్ష్మి, బి దీపిక, వి.తనూజ డిస్టింక్షన్లు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ వి గురునాధ్ తన నివేదికలో వివరించారు.

మెడికల్ గ్రాడ్యుయేట్లు, కాలేజి ప్రొఫెసర్లు స్నాతకోత్సవ గౌన్లు ధరించి ప్రాంగణమంతా తిరుగుతూ వేదిక వద్దకు చేరుకున్నారు. ఎపి మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ మెడికల్ గ్రాడ్యుయేట్లతో హిపొక్రటిక్ ప్రమాణం చేయించారు. అనంతరం డిగ్రీల ప్రదానం జరిగింది.

జిఎస్ఎల్ సంస్ధల చీఫ్ మెంటార్ డాక్టర్ గన్ని భాస్కర రావు ముఖ్యఅతిధిని పరిచయం చేశారు

జిఎస్ఎల్ సంస్ధల డీన్ బ్రిగేడియర్ డాక్టర్ వైవి శర్మ, మెడికల్ సూపరింటెండెంట్ బ్రిగేడియర్ డాక్టర్ టివిఎస్ పి మూర్తి, డాక్టర్ కందుల సాయి తదితరులు వేదికపై వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *