జీఎన్ రావు కమిటీ సిఫారసులు…ముఖ్యాంశాలు

1. అమరావతి, మంగళగిరిలో హైకోర్టు బెంచ్, శాసనసభ ఉండాలి. ప్రభుత్వ క్వార్టర్లు, గవర్నర్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంచాలి. నాగార్జున యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. కొత్తగా భూసేకరణ చేయకుండా ఆ భూముల్లో ప్రభుత్వం ఐకానిక్ భవనాలు నిర్మించవచ్చు. అమరావతిలోని వరదలు వచ్చే ప్రాంతాలను వదిలేసి మిగిలిన ప్రాంతాలను అభివృద్ది చేయాలి.

2. విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. వేసవికాలంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీసును నిర్మించాలి.

3. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నందును కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సిఫారసు.

4. పరిపాలనా సౌలభ్యం కోసం కర్ణాటక తరహాలో కమిషనరేట్ విధానాన్ని అవలంభించాలి. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర కోస్తా (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం), మధ్య కోస్తా (ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు), దక్షిణ కోస్తా (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), రాయలసీమ (కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం)గా పరిపాలన విభజన చేసుకోవాలి.

5.తుళ్లూరు ప్రాంతంలో ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టినందున దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి శాఖల తరఫున వాడుకోవాలని సిఫారసు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోన్లలో వరదలు వచ్చేవాటిని కాకుండా మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధిచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *