e రీడర్ మీద ఇ చదువు నాకొక తృప్తికరమైన అనుభవం

మంచో చెడో ఒక టెక్నాలజీలో సౌకర్యాన్ని చూశాక అలాంటి సౌకర్యం లేకుండా పనిచేసుకోవడం ఎవరికీ నచ్చదు. నేను “ఇ చదువు” కూడా అలాగే మొదలుపెట్టాను.
వ్యాసాలు,విశ్లేషణలు, సామాజికాంశాలు, కథలు…ఇలాంటి పుస్తకాలు ఇంట్లో మూడు అల్మైరాల్లో కిక్కిరిసిపోయి వున్నాయి. ఎదోపుస్తకంతీసి చదువు మొదలుపెడితే ఏకబిగిన పూర్తిచేయడానికి ముప్పై ఏళ్ళక్రితం నాటి తీరికా ఓపికా కుదరడంలేదు. 
కినిగే (kinige.com) ఇపుస్తకాలు నాకొక పరిష్కారం అనిపించాయి. అక్కడ కొన్న పుస్తకాలను అడోబ్ డిజిటల్ ఎడిషన్ (ADE Free Download) లో సర్దుకుని  డెస్కటాప్, లాప్ టాప్, లలో చదువుకోవడం మొదలు పెట్టాను. పుస్తకాలను  iPad లో Bluefire Reader (Free Down load) లోకి బదిలీచేసుకున్నాక చదువుకోవడంలో సౌకర్యం బాగా పెరిగింది. 
అయితే ఐపాడ్ లో స్రీ్కన్ వెనుకనుంచి వచ్చే కాంతి వల్ల కళ్ళు లాగి ఎక్కువసేపు చదవడం ఇబ్బంది కరమయ్యింది. ప్రత్యామ్నాయాల అన్వేషణలోనే ఇరీడర్ గురించి నాకుతెలిసింది. సోని రీడర్ ebay లో కొని అందులోకి పుస్తకాలు బదిలీ చేశాను. ఇరీడర్ మీద మొదటిసారి తెలుగుపుస్తకాలు చదవడం నాకొక అద్బుతమైన అనుభవం. 130 గ్రాముల పరికరంలో 200 పుస్తకాలు ఇముడ్చుకుని ఎక్కడికైనా వెంటతీసుకువెళ్ళగలగడం నిజమేనా అనిపించేటంత ఆశ్యర్యకరమైన నిజం
ఇంక్ టెక్నాలజీ తో తయారైన రీడర్లు ఇతర మొబైల్, టాబ్లెట్టు ల మాదిరిగా చదువుతూంటే కళ్ళు లాగవు. ఒకపుస్తకాన్ని చదువుతున్న అనుభవమే వుంటుంది. పుస్తకం లాగే రీడర్లకు కూడా లైట్లు వుండవు. లైటువెలుగులోనే పుస్తకం చదువుకోవాలి…మొన్న మొన్నటి వరకూ రీడర్లమీదకూడా లైటు వెలుగులోనే పుస్తకాలు చదువుకోవలసి వచ్చేది. (విడిగా అమర్చుకునే బ్యాటరీ లైట్లు రీడర్లకోసం తయారుచేయడం మొదలైంది)
కంటికి శ్రమ లేకుండా రీడర్ లోనే లైటు అమర్చడం kindle white paper, Nook, Kobo glo లతో మొదలైంది. కినిగే పుస్తకాలు తెరుచుకునేదీ, తక్కువ బరువుదీ అయిన “కోబోగ్లో” రీడర్(ఇబెలో అమ్మకానికి అప్పుడు లేదు) అమెరికాలో వున్న మిత్రుడి ద్వారా తెప్పించుకున్నాను
“కోబోగ్లో”తో రాత్రివేళ కూడా గదిలో లైటువేయకుండా కళ్ళు మండకుండా హాయిగా చదువుకోగలుగుతున్నాను. (పగటిపూట చదువు కుదరటంలేదు)
అయితే తెలుగుపుస్తకాల్ని తెరవడంలో లైటులేని “సోనీ”కున్న సదుపాయాలన్నీ లైటున్న కోబోలో లేవు
ఈఫొటోలో రెండురీడర్లనూ చూడవచ్చు. అది కాళీపట్నం రామారావుగారి రచనల పుస్తకంలో ‘అదృశ్యము’ కథ పేజీ.
కోబోలో ఫాంటునిగాక పేజిని ఎన్లార్జి చసుకునే వీలుంది. చదివేవీలైన సైజుకి పేజీని పెంచడంవల్ల రెండు కాలమ్స్ ఫార్మేట్ లోవున్న పేజీలో రెండో కాలం కూడా పక్కనే కనబడుతోంది.
సోనీలో పేజీనిగాక ఫాంటునే పెంచుకునే సౌకర్యంవుంది. ఇందువల్ల రెండో కాలమ్ సోనీ రీడర్ మీద కనబడటంలేదు.
పేజీనిగాక ఫాంటునే పెంచుకోగలగడం ఎక్కువ సౌకర్యంకదా!
స్మార్ట్ ఫోన్లకంటే తక్కువ ధరకే (130 అమెరికన్ డాలర్లకు) రీడర్లు దొరుకుతున్నాయి. తెలుగు పుస్తడాలు చదువుకోడానికి సోని రీడరే సదుపాయంగా వుంది. దానికి ఇన్ బిల్ట్ లైటు లేకపోవడమే చిన్న అసౌకర్యం. దానికి ప్రత్యామ్నాయంగా లైటు అమర్చివున్న లెదర్ కేసు మార్కెట్ లోకి వచ్చింది. ఇబే లో దాన్ని తెప్పించాను. రెండో ఫోటోలో అది చూడవచ్చు 
అయితే మనం చదివే పుస్తకాల ప్రచురణ కర్తల సలహా లేకుండా రీడర్లు కొంటే ఒక వేళ ఆపుస్తకాలు రీడర్ మీదతెరచుకోకపోతే ప్రయోజనం నెరవేరదు. నేను కినిగే కిరణ్ గారి సలహా సూచనల మేరకే రీడర్లు కొన్నాను. 
కొన్నేళ్ళకు మళ్ళీ రోజూ కొంతసేపైనా తృప్తిగా చదువుకోగలుగుతున్నాను.
(ఇ రీడింగ్ గురించి ఆలోచిస్తున్న మిత్రులకు నా అనుభవం ఒక పరిశీలన కావచ్చన్న ఆలోచనతో ఇది మీముందుంచుతున్నాను)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *