మన ఆలోచనల్ని అమ్మేసుకుంటున్న గూగుల్ , ఫేస్ బుక్

నేను google లో ఏమేమి వెతుకుతున్నానో అదంతా Face Book దొంగతనంగానో / గూగుల్ కి డబ్బులిచ్చో చూసేస్తోంది.

ఇల్లుతుడవడానికీ, తడిగుడ్డ పెట్టడానికీ వున్న robot సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నాను.

ఒకరోజు తరువాత ఫేస్ బుక్ లో LG, Samsung, iSolutions etc తయారు చేస్తున్న ఆప్రొడక్టుల మీద sponsered / promotional అప్ డేట్స్ నాకు కనిపిస్తున్నాయి.

కాగితం మీద రాసింది మెమరీలో దాచుకుని సిస్టమ్ / ఫోన్ / ఐపాడ్ కు కనెక్టు చేయగానే డిస్ ప్లే చేసే డిజిటల్ / స్మార్ట్ పెన్ కోసం గతం లో వెతికాను…అపుడు కూడా ఇలాగే Smart Live Scribe ప్రొడక్టులు ప్రత్యక్షమైపోయాయి.

వెతకడం మొదలవ్వగానే ఎదురైపోయే వస్తువుల, సేవల సమాచారానికి మించిన మరో అద్భుతం వర్చువల్ ప్రపంచంలో వుండదు. దాన్ని రియాలిటీలోకి మార్చగల టెక్నలాజికల్ మార్కెట్ ను కూడా అర్ధం చేసుకోవచ్చు.

ఇంతటి మహిమకు మూలమైన cloud tagging కాన్సెప్టులను చూసి ఆశ్చర్యపోవచ్చు!

మనకి ఉచితంగా ఇంతలేసి వేదికలు ఉచితంగా ఇచ్చిన ఆమహా సంస్ధలు నాలుగుసొమ్ములు చేసుకుంటే తప్పా అనే వారు ” మనల్ని చూపించి, మన మీద నాలుగు సొమ్ములు చేసుకోడానికే ఉచిత ఎంట్రీలు ఇచ్చారని అర్ధం చేసుకోవాలి.

నెటిజన్ల కారణంగానే వచ్చే లాభాల్లో కొద్ది పాటి రాయల్టీ మనందరికీ వాళ్ళు పంచడమే న్యాయమూ, ధర్మమూ కూడా! #nrjy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *