మొదటి కృత్రిమ వైరస్ వయసు 60 ఏళ్ళే!

జిగురులాంటి పదార్ధం, దానికి కేంద్ర స్ధానం, చుట్టూ ఉల్లిపొరలు మాదిరిగా పల్చటి కవచం…ఇందులో కేంద్రమే ప్రాణం, జిగురే ఆహారం, పొరలే చర్మం. ఇది ఒక కణం, మొదట్లో ఇది ఏక కణ జీవి అమీబా. అమీబా చేపగా మారడానికి 8 కోట్ల సంవత్సరాలు, చేప తాబేలవ్వడానికి మరో 10 కోట్ల సంవత్సరాలు, తాబేలు, భూచరాలుగా జంతువులుగా మారడానికి మరో 20 కోట్ల సంవత్సరాలు పట్టింది. కోతి మనిషిగా మారడానిక మరో 50 వేలసంవత్సరాలు పట్టిందని 200 ఏళ్ళ క్రితం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించారు.

మనిషి బుద్ధి చైతన్యాలతో మూలాలు వెతుక్కుంటూ 40 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏకకణ జీవి దగ్గర ఆగాము.

జిగురు, కేంద్రం, పొరల కవచం వున్న ఏకకణమే మామూలు కంటికి కనిపించదు. ఆహారం తీసుకోవడం, ఎదగడం, జాతిని పెంపొందించుకోవడం కణం లక్షణం. కణం / సెల్ అత్యంత ప్రాధమిక మైన ప్రాణి అని భావిస్తూంటాం.

కణం కంటే మౌలికమైన మరో ప్రాణి అతిసూక్ష్మమైన జీన్. ఇందులో వుండేవి క్రోమోజోములు. రకరకాల బాక్టీరియాలు వైరస్ లు ఈ రూపంలోనే వుంటాయి.

నిర్జీవపదార్ధాల నుంచి పుట్టిన ప్రాధమిక జీవపదార్థం జీన్. కొన్ని జీన్లు కలిస్తే క్రోమోజోము, కొన్ని క్రోమోజోములు కలిస్తే ఒక కణం, వందలు, వేలు, లక్షలు, కోట్లు, కోటానుకోట్ల కణాలు కలిస్తే దోమ మొదలు మనిషి వరకూ వున్న 84 లక్షల జీవరాశులు.

కణం వయసే 40 కోట్ల సంవత్సరాలు అయితే, కణానికి మూలమైన జీన్ వయసు అంతకు ముందు ఎన్ని వందల కోట్ల సంవత్సరాలో కదా!

కృత్రిమంగా జీన్ ను అంటే వైరస్ ను 1962 లో అమెరికన్ శాస్త్రవేత్త మొదటి సారిగా సృష్టించారు.

నేను నైంత్ క్లాస్ లో వున్నపుడు సోషల్ మాస్టారు స్వర్గీయ ఆచంట సర్వేశ్వర దక్షిణా మూర్తి గారు ఈ విషయం చెప్పారు. హిందూ పేపర్ లో వార్తవచ్చిందని, కనిపెట్టిన వారి పేరు, ఊరు, వైరస్ పేరు చెప్పారు. ఏదీ గుర్తులేదు. అమెరికా సైంటిస్ట్, చైనా యుద్ధం వచ్చిన సంవత్సరంలో కనిపెట్టారన్న మాట మాత్రమే గుర్తుంది.

వైరస్ ఆలోచనలతో ఏ పనీ లేకుండా ఇంట్లోనే వుండి పోవడం వల్ల నేను తెలుసుకున్న, గుర్తున్న జీవపరిణామాన్ని మీ మీదకి వొదులుతున్నాను…అంతే!

అంతా చదివి “అయితే ఏంటి” అని మీరడిగితే 🙄 పిచ్చిమొహమే #nrjy సమాధానం!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *