హైదరాబాద్ కు ధీటుగా ఎపిలో వైద్యవిజ్ఞాన వికాసం

హైదరాబాద్ కు ధీటుగా ఎపిలో వైద్యవిజ్ఞాన వికాసం

ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీల కృషి ఫలితం

రాష్ట్రవిభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ లో 136 మంది కార్డియోథొరాసిక్ సర్జన్లు వున్నారు. వీరిలో 103 మంది హైదరాబాద్ లో స్ధిరపడిన వారే!   వైద్యచికిత్సల పరంగా హైదరాబాద్ ప్రాముఖ్యతను అర్ధంచేసుకోడానికి ఈ ఒక్క అంకె సరిపోతుంది. 

ఈలోటుని దిద్దుకోవడం వస్తువుకొన్నంత వేగంగా జరిగిపోయేది కాదు. వైద్యులను తయారుచేసుకోవాలి. వారిలో నైపుణ్యాలు పెంచాలి. ఇందుకు అవసరమైన మౌలికసదుపాయాలను కల్పించుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. వైద్య సేవలు పొందే రోగుల విశ్వాసాన్ని పొందాలి. అన్ని వనరులూ పోగుపడిపోయిన హైదరాబాద్ లో మార్కెట్ ఆలంబనగా పెద్ద ప్రయత్నం లేకుండానే స్ధిరపడిన రంగాలలో హెల్త్ కేర్ రంగం ముఖ్యమైనది. 

రాష్ట్రం విడిపోయాక రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో వైద్య చికిత్సల రంగం ఎదుగుదల మొదలైంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో 27 మెడికల్ కాలేజీలు, 13 డెంటల్ కాలేజీలు వున్నాయి. వైద్యరంగంలో అడ్వాన్స్ డ్, లెర్నింగ్ – ప్రాక్టీసు విధానాలు ప్రయివేటు రంగంలో వృద్ధి చెందుతున్నంతగా ప్రభుత్వరంగంలో విస్తరించడంలేదు. 

ప్రభుత్వ రంగంలోకాని, ప్రయివేటు రంగంలో కాని జిల్లాకి ఒకటి, రెండు చొప్పున వున్న మెడికల్ కాలేజీలు, వాటి టీచింగ్ హాస్పిటల్స్ లో జరిగే సెమినార్లు, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు, లైవ్ సర్జరీ వర్క్ షాపుల వల్ల వైద్యరంగంలో జ్ఞాన విజ్ఞానాలు కన్సాలిడేట్ అవుతున్నాయి. ఇలాంటి ఈ వెంట్లు జరిగినపుడల్లా మనం ఎవరికీ తీసిపోము అన్న ధైర్యం వస్తుంది.

కొత్త ధోరణులను, టెక్నాలజీలను పసిగట్టడం, అధ్యయనం చేయడం, అమలు చేయడాల్లో ప్రయివేటురంగానికి వున్న స్వేచ్ఛ ప్రభుత్వరంగానికి వుండదు. విద్యా బోధనకు ఆధునిక వనరులు వుండాలి. వాటి ప్రాక్టీసుకు వేర్వేరు సమస్యలు వున్న హెచ్చుమంది రోగులు కావాలి. ఇదంతా సమకూర్చుకోవడంలో ప్రయివేటు మెడికల్, డెంటల్ కాలేజీల మధ్యపోటీ వల్ల వైద్యవిద్యార్ధులు, వైద్యులు సరికొత్త నాలెడ్జ్ తో అప్ డేట్ అవుతున్నారు. తక్కువ ఖర్చుతోనే రోగులకు వైద్య చికిత్సలు అందుతున్నాయి.

రాజమండ్రి వద్ద గల జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి ఏర్పాటుచేసుకున్న మెడికల్ సిములేషన్ లాబొరేటరీ ని ఆంధ్రప్రదేశ్ లో వైద్యవిద్యల, వైద్యవసతుల అభివృద్ది విస్తరణలకు ఒక ఉదాహరణగా చూడవచ్చు. 

సిములేషన్ లేబొరేటరీ అంటే రోగ నిర్ధారణ కోసమో, వ్యాధికి చికిత్స కోసమో మానవ శరీరం లోపలి నిర్మాణాన్ని  చూస్తూ, తాకుతున్న అనుభూతి చెందుతూ, అర్ధం చేసుకోగల అద్భుతమైన ఒక వర్చువల్ రియాలిటీ!  ఇది డాక్టర్ గా మొదటి అడుగువేసే సరికే అనేక సర్జరీల అనుభూతితో నైపుణ్య సామర్ధ్యాలను ఇవ్వగల అధ్యయనం…సాధనం ఇది నిజమైన ప్రపంచాన్ని కృత్రిమంగా ఓ గదిలో ప్రతి సృష్టించే ప్రక్రియే సిమ్యులేషన్‌. అసలైన మనుషుల్ని  పోలిన కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ పరికరాలను  ‘సిమ్యులేటర్లు’ అని అంటారు. 

రోగాలు, వ్యాధులకు మూలాలను నయం చేయగల శస్త్రచికిత్సా పద్ధతులను  వైద్య విద్యార్ధులైనా వైద్యులైనా , రోగుల లనుంచే అధ్యయనం చెయ్యాలి…మృతదేహాలనుంచే నేర్చుకోవాలి… డిసెక్షన్ లో పదేపదే కోసికోసి శరీర అంతర్భాగాలను పరిశీలించడం చివికి శిధిలమైపోయే శవాలతో సాధ్యం కాదు.

ఎలక్ట్రానిక్ వైద్య విజ్ఞానం నుంచి పుట్టుకొచ్చిన ఈ నిర్జీవ శరీరాలు ఊపిరి అందనపుడు మనుషులు ఎంతగా గిలగిలలాడిపోతారో చూపిస్తాయి. నొప్పివచ్చినపుడు ఎంతగా విలవిలలాడిపోతారో వివరిస్తాయి. సిమ్యులేటర్లలోనూ రక్త ప్రసరణ జరుగుతోంది. గుండె కొట్టుకుంటోంది. వూపిరితిత్తులు పనిచేస్తున్నాయి. ప్రాణం లేదన్న మాటే కానీ, మనిషి శరీరంలో జరిగే అనేక చర్యలు ఆ సిమ్యులేటర్లలోనూ చోటు చేసుకుంటున్నాయి. అచ్చంగా మనిషిని పోలిన ఆ సిమ్యులేటర్లను తెరిచి చూస్తే మానవ అవయవ వ్యవస్థే కనిపిస్తుంది. అలాంటి సిమ్యులేటర్లపైన వైద్యులకు ఇచ్చే శిక్షణ వారి నైపుణ్య స్థాయిల్ని అమాంతం పెంచేస్తోంది.

వైద్య విద్యలను నేర్చుకునే వారికీ, నేర్పించే వారికీ ఈ కృత్రిమ మనుషులకు మించిన ఆబ్జెక్టులు లేనే లేవు. రోగమూలకమైన శరీర అంతర్భాగాన్ని బాధితుడి లక్షణాలను బట్టి, నిరంతరాయ పరిశీలనలను బట్టి, సృజనాత్మకమైన శాస్త్రీయతను బట్టి, మత్తుమందు లేకుండా, వ్యాధిగ్రస్తుడు బాధతో అరుస్తున్నపుడు సర్జరీ ద్వారా నయం చేసిన ”చరకుడి” అధ్యయనం, పరిశోధన, అన్వేషణ, ఒక కాగడా మరొక కాగడాను వెలిగించినట్టు, పరంపరగా,తరతరాలుగా విస్తరిస్తూ….జి ఎస్ ఎల్ సిములేటర్ లేబొరేటరీ అపురూపమైన అధ్యయనశాలగా ఎదిగింది.

శరీర అంతర్భాగాలలో అన్ని విభాగాలనూ వేర్వేరు మాడ్యూళ్ళుగా వర్గీకరించి వాటన్నిటికీ సిమ్యులేటర్లను రూపొందించారు. అలాంటి అనేక మాడ్యూళ్ళను ఒకే చోట చేర్చిన  “ సిమ్యులేషన్ మాడ్యూల్స్ ఫర్ అడ్వాన్డ్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ లేబొరేటరీ” ని క్లుప్తంగా జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ అంటున్నాము.

టెక్నాలజీ…టెక్నిక్…స్టడీస్…రీసెర్చ…ఇదొక ఆగని ప్రవాహం…నిరంతర ప్రయాణం….అందులో జిఎస్ఎల్ స్మార్ట్  లాబ్ అతి పెద్దమలుపు

ఒకొక్క మాడ్యూల్ లో ఒకొక్క ఎలక్ట్రానిక్ మెంటార్…లాప్ మెంటార్ అనే లాప్రోస్కోపిక్ మాడ్యూలులొ 3డి వ్యూతో లెర్నర్ మొదలు సీనియర్ వరకూ అన్ని లెవెల్స్ లో స్టడీ చేసే ఏర్పాటు వుంది.

అలాగే ఎముకల నిర్మాణంపై అర్ధో మెంటార్, గుండెలోకి తొంగి చూడగల  యాంజియో మెంటార్, ఊపిరి తిత్తులను చూపించే బ్రాంకో మెంటార్, శరీరం లో ప్రకంపనల ఆధారంగా స్ధితిగతులను అధ్యాయనం చేసే అల్ట్రా సౌండ్ మెంటార్, రాబోటిక్ సర్జరీలను నేర్పించే మెంటార్ జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ విశేషాలు.

అనాటమేజ్ అనే అపురూపమైన ఉపకరణం…ఇది ఒక ఎలక్ట్రానిక్ శరీరం…నిలువుగా అడ్డంగా మూలగా 360 డిగ్రీల్లో కోసి స్ట్రక్చర్ ను అధ్యయనం చేసి తిరిగి అతికించే అద్భుతమైన సాధనం…రోగి స్కానింగ్ రిపోర్టులను ఎక్స్ రేలను ఇందులో ప్రవేశపెట్టి సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ విధానాన్ని ఖరారు చేయగల ఈ అపూర్వ పరికరం…జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ లో మరో ప్రత్యేకత.

ట్రెయినింగ్ తీసుకుంటున్న వారి అధ్యయన పద్ధతిని, చికిత్సా విధానాన్ని ప్రతీ మెంటరూ విశ్లేషించి తప్పొప్పుల్ని చూపిస్తుంది. మార్కులు వేస్తుంది. గతంలోకంటే మెరుగుదలను వివరిస్తుంది. 

స్మార్ట్ లాబ్ జిఎస్ఎల్ కాలేజీలకు మాత్రమే పరిమితం కాదు. ఇతర సంస్ధల సర్జరీ పోస్టుగ్రాడ్యుయేట్లు, సర్జన్లు కూడా ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్డ్ లెవెల్ వరకూ ట్రెయినింగ్ పొందుతూనే వున్నారు. 

తూర్పు ఆసియాలోనే పెద్దదైన “జి ఎస్ ఎల్ స్మార్ట్ లాబ్” లో వర్చువల్ శిక్షణ పొందడానికి వివిధ రాష్ట్రాల నుంచి సర్జరీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న మెడికోలు వస్తున్నారు. రాజధానే లేని ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య వసతులన్నీ సమకూరడం ఒక్కరోజులో అయ్యే పని కాదు. ప్రభుత్వ రంగంలోకాని, ప్రయివేటు రంగంలో కాని జిల్లాకి ఒకటి, రెండు చొప్పున వున్న మెడికల్ కాలేజీలు, వాటి టీచింగ్ హాస్పిటల్స్ లో జరిగే సెమినార్లు, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు, లైవ్ సర్జరీ వర్క్ షాపుల వల్ల వైద్యరంగంలో జ్ఞాన విజ్ఞానాలు కన్సాలిడేట్ అవుతున్నాయి. ఇలాంటి ఈ వెంట్లు జరిగినపుడల్లా మనం ఎవరికీ తీసిపోము అన్న ధైర్యం వస్తుంది. గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాక్టిషనర్లలో జాతీయ స్ధాయి వాలిడేషన్, అప్ డేట్ ఒకటి ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతోంది. 

ఉదరకోశ, జీర్ణాశయ, పేగుల సర్జరీలు చేసే గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్లకు ప్రతిష్టాత్మకమైన  (ఫెలోషిప్ ఇన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎండో సర్జన్స్) ఫెలోషిప్ ఇచ్చే వైద్య విజ్ఞాన వేదిక గా రాజమహేంద్రవరం సమీపంలోని  జిఎస్ఎల్ మెడికల్ కాలేజి&హాస్పిటల్ కు గౌరవం లభించింది. 

దేశవ్యాప్తంగా 6 వేల మంది డాక్టర్లు సభ్యులుగా వున్న ఈ అసోసియేషన్ ఇచ్చే ఫెలోషిప్ కి దేశదేశాల్లో గౌరవ ప్రతిష్టలు వున్నాయి. అనుభవం వున్నవారికి చర్చాగోష్టుల్లో వారు సమర్పించే కేస్ స్టడీలను బట్టి, జూనియర్లకు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములలో వారు చూపే అవగాహన, లైవ్ వర్క్ షాపులలో వారు సర్జరీలు చేసే తీరుతెన్నులను బట్టి FIAGES ఫెలోషిప్ ఇస్తారు. 

సర్జన్ల వృత్తి నైపుణ్యాలను మదింపు చేయడానికి పరిపూర్ణమైన వైద్యవిజ్ఞాన సదుపాయాలు, వసతులు వుండాలి. అలాంటి వేలిడేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి జిఎస్ఎల్ మెడికల్ కాలేజి అండ్ జనరల్ హాస్పిటల్ ను అసోసియేషన్ ఎంపిక చేసినట్టు  ఆల్ ఇండియా అసోసియేషన్  ప్రసిడెంట్ డాక్టర్ రమేష్ అగర్వాల్ ప్రకటించారు. రెండు విడతలుగా ఇప్పటికి 109 మంది ఫెలోషిప్ సాధించారు. 

సామర్ధ్యంలో, నైపుణ్యంలో, అనుభవంలో మన డాక్టర్లు  ప్రపంచంలో ఎవరికీ తక్కువకాదు…సదుపాయాల కల్పనలో, నూతన వొరవడులు తీసుకు రావడంలో తెలుగువారు ఎఒక్కరికీ తక్కువ కాదు…నవ్యాంధ్ర ప్రదేశ్ ను సరికొత్తగా నిర్మించుకుంటున్న మనం ట్రీట్ మెంటు కోసం హైదరాబాద్ కో చెన్నయ్ కో వెళ్ళ వలసి వుంటుందంటే అది మైండ్ సెట్ లోపం మాత్రమే…మనల్ని మనం పరిశీలించుకుంటే ఇది అర్ధమౌతుంది…మన సామర్ధ్యం మనకే బోధపడుతుంది….వైద్యరంగంలో సదుపాయాలను, మానవ నైపుణ్యాలనూ ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే మన నైపుణ్యానికి మించిన స్కిల్ లేదని లెక్కతేలుతుంది…అంటున్నారు జిఎస్ఎల్ వైద్య, వైద్య విద్యా సంస్ధల వ్యవస్ధాపకుడు డాక్టర్ గన్ని భాస్కరరావు!  

– పెద్దాడ నవీన్