టిఆర్ఎస్, తెలుగుదేశం సహా అన్నిప్రధాన పార్టీలూ సాధారణ ఎన్నికల్లో ఓట్లు కొంటున్నాయి. ప్రభుత్వాన్ని నిలుపుకోడానికి ప్రజాప్రతినిధులను పార్టీ మారేలా ప్రలోభపెట్టే సామదానబేధదండోపాయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయే. తిరుగులేని ఆధిక్యత కోసం గుత్తగా ఎమ్మెల్యేలను కొనే విధానాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టారు. ఇదంతా అవినీతే…ఇలా సామాజిక ప్రాబల్యం, రాజకీయ అధికారం ఉన్నవారు బాహాటంగా అవినీతికి పాల్పడుతున్నా రాజకీయాల్లో ఇది మామూలేలెమ్మన్న మెట్టవేదాంతం ప్రజలబుర్రలోకి ఎక్కేసింది. రాజకీయ అవినీతికి ప్రత్యర్థులు కూడా పాల్పడినపుడు, టివిగొట్టాలముందో, పత్రికాగోష్టుల్లోనో గొంతుచించుకుని నీళ్ళుతాగి వెళ్ళిపోయే ధోరణిని ఏప్రయోజనకోసమైనాగాని కెసిఆర్ మార్చేశారు. ఫలితంగా రేవంత్ రేడ్డి అడ్డంగా దొరికిపోయారు. తెలుగుదేశం ఆత్మరక్షణలో పడిపోయింది.
నిజానికి ఈ ఉదంతంలో చట్టం నిర్వర్తించవలసిన బాధ్యతలేతప్ప ప్రజలు చేసేదేమీలేదు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులూ వారివారి పార్టీలూ పరస్పరం దూసుకుంటున్న మాటలు విభజనకు ముందు రెండు రాషా్ట్రల్లో గూడుకట్టుకున్న విద్వేషాలను తట్టిలేపుతున్నట్టువున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ తెలంగాణా విభాగం ద్వారా తెలంగాణా ప్రభుత్వ వ్యవహారాల్లో వేలుపెట్టడం కెసిఆర్ కు ఆపార్టీకేగాక జనసామాన్యానికి కూడా ఇష్టంలేదు. అలాగే తెలుగుదేశానికి తెలంగాణాలో పనేమిటి అని విసుక్కునే వారు తెలుగుదేశంలోనేకాక సీమాంధ్రప్రాంత ప్రజానీకంలో కూడా హెచ్చుమందే వున్నారు. అదేసమయంలో కెసిఆర్ ను సహించని సీమాంధ్రులు ఆయన్ని ఎదిరించే హీరోగా రేవంత్ రెడ్డిని చూస్తున్నారు.
పోలీసు ఎస్కార్టులో వున్నపుడు రేవంత్ రెడ్డి మీసం మెలివేయడం తెలంగాణా వారికంటే ఆంధ్రులకే హెచ్చుగా నచ్చిందంటే ఇటువైపు రగిలిన ఉద్వేగాన్ని అర్ధం చేసుకోవచ్చు. విభజనానంతరం ఏర్పడిన రాజకీయాల చిక్కుముడులనుంచి రూపొందుతున్న ఉద్వేగాలకు ఒక సూచిక. ఇందులో యాక్షన్ సినిమా ఇచ్చే కిక్కు వినోదమేకానీ, పతనమైన నీతికి సంకేతం కూడా!
ఉభయరాష్ట్రాల నేతలూ అనేక కారణాల వల్లా, తమ వాగ్దానాలను నెరవేర్చగలిగే స్థితిలో లేరు. రాష్ట్రవిభజనకు సంబంధించిన ఉద్వేగాలు సజీవంగా వున్నంతకాలం వాగ్దానాల గురించి ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టరు. అలాంటి కాలయాపనకైనా గాని ఉభయులకూ కావలసింది ప్రజల ఉద్వేగాలే!
పట్టుకున్న టిఆర్ఎస్ ని, దొరికిపోయిన తెలుగుదేశాన్ని పక్కనపెడితే- ఎమ్మెల్యేలను కొనడం ఏమిటని వైఎస్ జగన్ చీల్చి విమర్శలతో చీల్చి చెండాడుతారు. కాంగ్రెస్ పెద్దలు, రేవంత్ దీ తప్పే, టీఆర్ఎస్దీ తప్పే అంటూ- తమకసలు కొనుగోళ్లే తెలియనట్టు అమాయికంగా చూస్తారు. నీతిశాస్త్రానికే హక్కుదారులమన్నట్టు వ్యవహరించే బీజేపీ నేతలు ఏ మాటా గట్టిగా చెప్పలేక నీళ్లు నములుతుంటారు.
ఇన్ని మాటలుచెప్పేవారెవరికైనా ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాభిమతాన్ని అవహేళన చేస్తున్న కొనుగోలు విధానాలమీద నిజమైనవ్యతిరేకత ఉన్నదా?
ఇలావుండగా విభేదాలను పక్కనబెట్టి సర్దుకుపో వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాషా్టల్ర ముఖ్యమంత్రులకు ఉమ్మడి రాషా్టల్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. అభివృద్ధిపై దృష్టిసారిస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని హితవుపలికారు.
ఎమ్మెల్సీ ఎన్ని కల సందర్భంగా చోటు చేసుకు న్న ఓటుకు నోటు వివాదం ఇరు రాషా్టల్ర ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర స్థాయి విభేదాలకు దారితీయడంతో కేంద్రం సూచన మేరకు గవర్నర్ నరసింహన్ మూడు రోజుల ఢిల్లీ ముగించుకుని వచ్చిన వెంటనే శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ కొంతకాలం పాటు సంయమనంతో వ్యవహరించాలని ఇరువురు సీఎంలను కోరినట్లు తెలిసింది. రెండు తెలుగు రాషా్టల్ర సీఎంలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వితే ఆయా రాషా్టల్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనీ, ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కుంటుపడే అవకాశం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉందనీ, కొంతకాలం పాటు ఇరువురు సంయమనం పాటిస్తే సమస్యల వాటంతట అవే సద్దుమణిగి పోతా యని నచ్చజెప్పినట్లు తెలిసింది. అయితే, గవర్నర్ సూచనపై ఇరు రాషా్టల్ర సీఎంలు కొంత సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కేంద్రం సూచ నతో ఇరువురు సీఎంలతో చర్చలు జరిపితే రెండు తెలుగు రాషా్టల్రలోనూ విభేదాలు సద్దుమణిగే అవకాశం ఉందని కేంద్రం చేసిన సూచన మేరకే గవర్నర్ కేసీఆర్, చంద్రబాబుతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
KCR’s Immoral Vs CBN illegal
కెసిఆర్ – తెలుగుదేశం పార్టీ MLAలను ఎందుకు తెరాసలోకి లాక్కుంటున్నాడు?
అది నీతి వంతమైన పనేనా?
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా మునిగిపోయో పడవో – అదే పరిస్థితి తెలంగాణలో తెలుగుదేశం పార్టీది కూడా.
ఆంధ్రాలో మళ్ళి బతికే పరిస్థితే లేదనే ‘కాంగ్రెస్ పార్టీ నాయకులు’ తెలుగుదేశంలోకో – మరో వైపుకో వెళ్ళిపోతున్నారు.
తెలంగాణాలో రెండే ఉన్నాయి 1. తెరాస 2. కాంగ్రెస్. మరో ప్రాంతీయ పార్టీకి స్థానం ఉండదు.. లేదు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న పడవ.
మునిగిపోతున్న పడవలో కూర్చునే ప్రయాణం ఎవ్వడన్నా చేస్తాడా!
వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమవ్వచ్చు -బంగారు తెలంగాణ నినాదంలో – తెలంగాణ బిడ్డలుగా భాగస్వాములవ్వాలనే మంచి ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు నుండి తెరాస – ప్రభుత్వంలోకి MLAలు అవ్వచ్చు / వ్యక్తులు అవ్వచ్చు ‘భాగస్వాములుగా’ వెళ్తున్నారు.
వచ్చే వాళ్ళను ‘రావద్దు.. రావద్దు’ అంటూ అడ్డు పడవలసిన అవసరం కెసిఆర్ కి లేదు.
కెసిఆర్ పార్టీలోకి – కెసిఆర్ ప్రభుత్వంలోకి వచ్చే వాళ్ళు నీతి మంతులా కాదా!
KCR చేస్తున్న కార్యక్రమాలు మంచివో – కాదో తెలంగాణ ప్రజలు ప్రజాకోర్టులో నిర్ణయిస్తారు.
కెసిఆర్ – చంద్రబాబు లాగా ”illegal” కార్యక్రమాల్లో భాగస్వామి కాదు.
కనిపిస్తున్న సాక్ష్యాధారాలను బట్టి, ‘illegal” కార్యక్రమాలు చేస్తే ‘చట్టం’ అడ్డుకుంటుంది.
చంద్రబాబు క్రిమినల్. కోర్టులో తలవంచక తప్పదు.