ఈ డిజిటల్ ఉత్తరం మీద హక్కు నాదేనా! డిలిట్ చేశాక కూడా డేటా వుండిపోయిన సర్వర్లదా?

తాళపత్రాలు కాలంలో కరిగిపోయాయి. భావవ్యక్తీకరణ ఉపకరణాలు మాయమై,రూపాంతరమౌతున్నాయి, డిజటలవుతున్నాయి. 


నువ్వు చదువుతున్న ఈ అక్షరాలు, దీనికి జతచేసిన ఫోటో, ఇంతకుముందు నువ్వు ఫోన్ లో మాట్లాడిన మాటలు, మొన్న షేర్ చేసిన వీడియో…ఇలాంటి డేటాను మనండిలిట్ చేసేయవచ్చు. అసలు మన అడౌంట్లను మనమే ధ్వంసం చేసుకోవచ్చు…..

అయినా ఆ డేటా అంతా వేర్వేరు సర్వర్లలో అలాగే వుండిపోతుంది.

అర్ధం కాలేదా? అలా పోగులు పడిపోయిన డేటాను క్రోడీకరించి, సెర్చ్ ఇంజన్లు గుర్తించ డానికి పేర్లు పెట్టి క్షణాల్లో మనం అడిగింది చూపిస్తున్న గూగుల్ నీకు అనుభవమే కదా?

గూగుల్ లాంటి మహా మహా సర్వర్లు దాచివుంచుతున్న డేటా నీటి సముద్రాలకు మించిన డేటా సాగరాలైపోతూండటం….కంటికి కనిపించని డేటా నిక్షేపాల పై హక్కులెవరివి? ఎవరు డేటాను నిర్వహిచాలి? మహా సర్వర్ల యాజమాన్యాలే డేటాను సొంతం చేసేసుకుంటే వాటి సృష్టికర్తలైన మనుషుల సృజన కు ఈ టెక్నాలజీ ముందు పేటెంటు హక్కులు నిలుస్తాయా? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు లేవు!

అంతెందుకు నేను రాసిన ఈ డిజిటల్ ఉత్తరం మీద హక్కు నాదేనా! నువ్వూ నేనూ డిలిట్ చేశాక కూడా డేటా వుండిపోయిన సర్వర్ల నిర్వాహకులవా ?

ఈ అంశాలన్నిటినీ చర్చిస్తూ వచ్చిన ఇంగ్లీషు పుస్తకం ” ది బిగ్ డేటా” మానవుల స్వాభావిక వివేకాన్ని భర్తీ చేసే అవకాశం డేటాబ్యాంకులకు వుండకూడదనే వాదిస్తోంది.

ఇండియా టుడే తాజా సంచికలో ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఆపేజీ ని నువ్వు అర్దం చేసుకోడానికే ఈ ఉత్తరం

అనుమానమొస్తే ఫోన్ చెయ్యి!

ఇంకోవిషయం : ఇంటియా టుడే డిజిటల్ ఎడిషన్ కి డబ్బుకట్ టిచదువుతున్నాను గనుక అందులో ఒక పేజీ నీకుపంపడం వాళ్ళ హక్కుల్ని దొంగిలించినట్టు కాదు:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *