ఎదుగుతున్న తెలుగు e పుస్తకం

ఆత్మకథలు, రాజకీయ చరిత్రలుఅంతగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కూడా చరిత్రలో ఒక పార్శ్వమే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో కీలక ఘట్టాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో వున్నాయి.
ఒక టెక్నాలజీ నుంచి మారిన జన జీవనశైలి అచ్చు పుస్తకాన్ని వెనక్కి పింపించింది. అయితే మరో టెక్నాలజీ మాయోమంత్రమో అన్నంత అద్భుతంగా సర్వర్లలో నిక్షిప్తమై వున్న పుస్తకాలను గాలిలోనుంచి తీసి కళ్ళముందు వుంచుతోంది. మొబైల్ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లు జేబుల్లోకి చేరిపోతూండటంతో ప్రేక్షకులు గా మారిన ఒకనాటి పాఠకులు, కొత్తగా రూపుదిద్దు కుంటున్న చదువరులు తిరిగి e (ఎలక్ట్రానిక్) పాఠకులుగా మారుతున్నారు.
ఎదుగుతున్న తెలుగు e పుస్తకం

హరిరామ జోగయ్య 60 వసంతాల రాజకీయ ప్రస్ధానంలో ఏం రాశారు? 200 పేజీల ఈ పుస్తకంలో ఒక పేజీలో ఒక పేరాగ్రాఫు లో వున్న విషయాన్ని తీసుకుని న్యూన్ టివిలు ఊదరగొట్టేశాక లక్షలాదిమంది ప్రజల్లో రేకెత్తిన ఉత్కంఠ కుతూహలాలు చల్లబడాలంటే ఆపుస్తకాన్ని చదవవలసిందే. అయితే ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? ఆర్డరు పెడితే ఎప్పటికి చేతికందుతుంది?? పాఠకులు టివి ప్రేక్షకులైపోయాక, పుస్తక పఠనం పట్ల ప్రజల ఆదరణ తగ్గిపోవడం వల్ల తల ఎత్తిన ప్రశ్న ఇది. అచ్చు పుస్తకాల ముద్రణ తగ్గిపొవడం, ఇపుస్తకాల పబ్లికేషన్ పెరుగుతూండటం ప్రపంచమంతటా కనిపిస్తున్న ధోరణే! ముప్పై నలభై ఏళ్ళ క్రితం వరకూ వందేళ్ళపాటు తెలుగు పుస్తకాల ప్రచురణ వైభవంగా సాగింది. దాదాపు 4 లక్షల పుస్తకాలు, ప్రతీ పుస్తకానికీ సగటున మూడు వేల కాపీలతో తెలుగునాట గ్రంధాలయాలే ఉద్యమంగా విలసిల్లాయి. ప్రపంచ పోకడలోపడి తెలుగు పుస్తకం కూడా కాంతి తగ్గింది. ఒక టెక్నాలజీ నుంచి మారిన జన జీవనశైలి అచ్చు పుస్తకాన్ని వెనక్కి పింపించింది. అయితే మరో టెక్నాలజీ మాయోమంత్రమో అన్నంత అద్భుతంగా సర్వర్లలో నిక్షిప్తమై వున్న పుస్తకాలను గాలిలోనుంచి తీసి కళ్ళముందు వుంచుతోంది. మొబైల్ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లు జేబుల్లోకి చేరిపోతూండటంతో ప్రేక్షకులు గా మారిన ఒకనాటి పాఠకులు, కొత్తగా రూపుదిద్దు కుంటున్న చదువరులు తిరిగి e (ఎలక్ట్రానిక్) పాఠకులుగా మారుతున్నారు. పబ్లిషర్లు, స్వయంగా రచయితలు కూడా పుస్తకాలను డిజిటలైజ్ చేసి సర్వర్లలో వుంచితే పాఠకులు ఖరీదు చెల్లించి డౌన్ లోడ్ చేసి చదువుకునే ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే జరుగుతూంది. కంప్యూటర్లు, లాప్ టాప్ లు, టాబ్ లెట్ పిసిలు, స్మార్టుఫోన్లు, ఈ పుస్తకాలకోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఇ రీడర్ గాడ్జెట్లు లో ఎలక్ట్రానిక్ పుస్తకాలను ప్రత్యేకమైన అప్లికేషన్ల ద్వారా చదువుకో వచ్చు. ఇరుకు ఇళ్ళలో చోటంతా ఆక్రమించే పెద్దపెద్ద పుస్తకాల బీరువాలతో పని లేని సదుపాయాన్ని ఇ బుక్స్ తెచ్చి పెట్టాయి. ఇ బుక్స్ పబ్లికేషన్ లో అమెజాన్ ప్రపంచంలోనే మొదటి స్ధానంలో వుంది. ఆసంస్ధ సొంత ఇ రీడర్ ‘కిండల్ ‘ ను సగానికి సగం ధర తగ్గించి భారతదేశంలో అమ్ముతున్న సంగతి టివి యాడ్స్ లో చూస్తూనే వున్నాము. ఇండియాలో పుస్తక పఠనానికి వున్న డిమాండుని అమెజాన్ గుర్తించింది కాబట్టే ఇటు వైపు దృష్టి పెట్టింది. ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగా డబ్బు చెల్లించి ఇ పుస్తకాన్ని సొంతంగా కొనేసుకోవచ్చు లేదా పరిమిత కాలానికి అద్దెకు తీసుకోవచ్చు. కాలపరిమితి ముగిశాక ఆ ఇపుస్తకం తెరుచుకోదు. కినిగె.కామ్ (kinige.com) అనే సంస్ధ తెలుగులో ఇ పుస్తకాలు ప్రచురిస్తోంది. వందలు వందలు దాటి ఆసంస్ధ ప్రచురణల సంఖ్య వేలకి చేరుకుంది. తెలుగు ప్రజల పుస్తకాభిమానం రూపం మార్చకుంటోందే తప్ప అంతరించిపోలేదు అనడానికి పెరుగుతున్న కనిగె ఇ పుస్తకాల సంఖ్యే ఒక సూచిక. ఈ సంస్ధ తాజా ఇపుస్తకం చేగొండి హరిరామజోగయ్య రాసిన ” అరవై వసంతాల నా రాజకీయ ప్రస్ధానం”. రంగాను చంపడానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారని ఎవరో చెప్పగా అది నిజమో అబద్ధమో తెలియక పోయినా నమ్మాను” అని అందులో జోగయ్యరాశారు. ఆత్మకథలు, రాజకీయ చరిత్రలుఅంతగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కూడా చరిత్రలో ఒక పార్శ్వమే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో కీలక ఘట్టాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *