అమెరికా నమ్మదగిన నేస్తమేనా

పెత్తనం చేయాలన్న కాంక్ష, ఎదిరించాలన్న దీక్ష…ఈ రెండే ఆధునిక చరిత్రలో అగ్రరాజ్యాలలో అందునా అమెరికా అనుకూల, వ్యతిరేక ప్రపంచాన్ని విభజించేశాయి. వృద్ధి చెందుతున్న దేశాల సహజశక్తులూ, మెరుగులు దిద్దుకుంటున్న నైపుణ్యాలూ, ‘పెద్దన్నల’ వాణిజ్య సైనిక పెత్తానాలను నిలువరించే దశకు పదునెక్కుతున్నాయి. వాస్తవాలను అర్ధంచేసుకోవడం వల్లో మరో మార్గలేకపోవడం వల్లో ఆధిక్యత చెలాయించే ధోరణి నుంచి ఇచ్చిపుచ్చుకునే పంధాలోకి మారిందంటున్న నేపధ్యంలో కూడా భారతదేశానికి అమెరికా నమ్మదగిన నేస్తమేనా అన్న ప్రశ్న చర్చకు వస్తూనే వుంటుంది.

“భారత్‌ లాంటి భాగస్వామి అమెరికాకు , అమెరికా లాంటి భాగస్వామి భారత్ కు ఇప్పుడు ఎంతో అవసరం గతంలో అడుగడుగునా ఆధిక్యతను కనబరిచే అమెరికా ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిక మారడం వల్ల ఆదేశంతో ఒప్పందాలు అంటే భయపడాల్సిన అవసరం ప్రస్తుతానికి కనిపించడం లేదు” ఇదే సారశంగా పత్రికలలోవిశ్లేషణలు సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు దేశాధినేతలు ప్రసంగించే ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాలకు, మోదీ అమెరికాలో భారతీయులను ఉద్దేశించి 27 న మాట్లాడే సభకు పదిరోజులు ముందునుంచే అమెరికాలో అమెరికా, భారత్ అధికారుల సమావేశాలు విరివిగా జరుగుతున్నాయి. మీడియా పరంగా పరస్పరం ఆశిస్తున్న అంశాలను ఉభయదేశాల అధికారుల వెలిబుచ్చుతున్నారు. పాకిస్తాన్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా అండాదండా ఇప్పుడు భారత్‌కు మరీ ముఖ్యం. భారత్‌, అమెరికా, జపాన్‌లు వాణిజ్య, రక్షణ రంగాల్లో గత కొద్ది కాలంగా కలిసి కదులుతున్నాయి. ఉగ్రవాదంపై నిజాయితీగా పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రధమ స్థానంలో ఉంటుంది. అదే విధంగా వాణిజ్యపరంగా కూడా భారత్‌ నమ్మదగిన మిత్రుడు. అందుకే అమెరికా భారత్‌కు అనుకున్న మేరకు స్నేహ హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నది. భారత దేశంతో తన రక్షణ సంబంధాలను మరింత వేగవంతం చేయడానికి, అలాగే ఆ దేశంలో హైటెక్‌ మిలిటరీ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సంయుక్తంగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పెంటగాన్‌ ఒక దేశం కోసం ప్రత్యేకంగా ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. నరేంద్రమోదీ ప్రభుత్వం వస్తు, సేవల జి ఎస్ టి పన్ను బిల్లు ఆమోదం సహా కీలకమైన సంస్కరణలను వేగంగా పూర్తి చేసి ఆర్ధిక వ్యవస్ధను పటిష్టం చేయాలని అమెరికాలో ఒబామా ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారి నిషా దేశాయ్ బిస్వాల్ సూచించారు. ఆమె ఆదేశపు హోమ్‌ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి సహాయ కార్యదర్శి పదవిని చేపట్టిన తొలి భారత సంతతి అమెరికన్‌ మహిళ. మోదీని భారతదేశపు గొప్ప ప్రచారకుడిగా (బ్రాండ్ అంబాసిడర్) నిషా దేశాయ్ అభివర్ణించారు. మోదీ సరళమైన విధానాలు, సాహసోపేతమైన నిర్ణయాలు అమెరికాలో ప్రయివేటు రంగం దృష్టిని భారత్ లో పెట్టుబడులపై దృష్టి పెట్టేలా చేశాయన్నారు. అయితే ప్రస్తుతం భారత్‌కు వెల్లువెత్తుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు), క్యాపిటల్‌ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మాత్రమే మోదీ ప్రభుత్వం ఆశిస్తున్న అత్యున్నత పురోగతికి సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు వస్తూత్పత్తి రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలు ఊపందుకునేందుకు వీలుగా మరిన్ని పెట్టుబడులు ప్రవహించాల్సి ఉన్నదని, తద్వారా ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో పరుగుపెడుతుందని వివరించారు. మోదీ ప్రభుత్వ సంస్కరణల వేగాన్నిబట్టే ఇదంతా ఆధారపడి వుటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *